- Step 1
ముందుగా ఒక పాత్రలో నాలుగు కప్పులు నీరు పోసి వేడిచేసి అందులో మీల్మేకర్ని వేయాలి.
- Step 2
10 నిమిషాల తర్వాత మీల్మేకర్ని వేడి నీటి నుండి తీసి చల్లటి నీటిలో 5 నిమిషాల పాటు ఉంచి నీరు లేకుండా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
తర్వాత ఒక బౌల్లో సెనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
- Step 4
తర్వాత బియ్యప్పిండి కారం కూడా వేసి నీళ్లతో కొద్దిగా పల్చగా ఉండేలా కలుపుకోవాలి.
- Step 5
ఇప్పుడు స్టౌపై బాణలి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత మీల్మేకర్ని సెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి వేయించాలి.
- Step 6
బంగారు రంగువచ్చే వరకు ఉంచి తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్పై మీల్మేకర్ పకోడీలను ఉంచితే నూనెను పీల్చుకుం టుంది.
- Step 7
పకోడీలు సాస్తో తింటే రుచిగా ఉంటాయి.