- Step 1
ముందుగా ఒక మందపాటి గిన్నెలో ఒక స్పూన్ నూనె, కొద్దిగా నీరు, కొంచెం ఉప్పు వేసి పొట్లకాయ ముక్కల్ని ఉడకబెట్టాలి.
- Step 2
ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- Step 4
పొట్లకాయ ముక్కలు చల్లారాక వాటిని పెరుగు మిశ్రమంలో కలపాలి.
- Step 5
ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి వేడెక్కాక ఎండు మిర్చి, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు సిద్ధం చేసుకోవాలి.
- Step 6
కొద్దిగా చల్లారాక పెరుగు పచ్చడి మిశ్రమంలో పోపును కూడా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
- Step 7
పెరుగు పచ్చడి అన్నంతో పాటు తింటే రుచిగా ఉంటుంది.