- Step 1
ముందుగా ఒక బౌల్ తీసుకుని మైదా, శనగపిండి, కారం, కొత్తిమీర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- Step 2
తర్వాత కొద్దిగా నీరును వేసి బాగాకలిపి ముద్దలా చేసి కొద్దిగా నూనె రాసి పక్కనపెట్టుకోవాలి.
- Step 3
స్టౌపై పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత కొబ్బరి తురుము, నువ్వులు, అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి.
- Step 4
తర్వాత కొత్తిమీర పొడి, మిర్చి పేస్ట్, పసుపు, జీలకర్ర, పంచదార, ఇంగువ, ఉప్పు ఒక్కొక్కటిగా వేస్తూ మరి కొంత సేపు వేయించుకోవాలి.
- Step 5
ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసి కలపాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శగనపిండి మిశ్రమాన్ని ఉండలుగా చేసి చపాతీలా వత్తాలి.
- Step 6
వాటిపై కొద్దిగా నీరు చల్లి బౌల్లో ఉంచిన కొబ్బరి తరుము మిశ్రమాన్ని పరిచి రోల్చేసి చివర్లు మడిచి గట్టిగా ప్రెస్చేయాలి.
- Step 7
ఇప్పుడు ఒక్కొక్క రోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- Step 8
బాణలిలో నూనె వేసి వేడెక్కిన తర్వాత కట్చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసి వేయించుకోవాలి. టీ టైమ్లో వేడి వేడిగా తింటే ఇవి రుచికరంగా ఉంటాయి.