- Step 1
కాప్సికమ్‌ను, ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. పనీర్‌ను పెద్ద ముక్కలుగా చేసుకోవాలి.
- Step 2
పచ్చి మిరపకాయలను కోసి పెట్టుకోవాలి. టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి.
- Step 3
పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి కాప్సికమ్, పనీర్, ఉల్లిపాయ ముక్క లు, టొమాటోలు ఒక దాని తర్వాత చిటికెడు ఉప్పు వేస్తూ వేసి వేయించి ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి.
- Step 4
నూనెను తిరిగి వేడి చేసి, దానిలో ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి.
- Step 5
అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి.
- Step 6
తర్వాత టొమాటో ప్యూరీ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
- Step 7
ఇప్పుడు అందులో కారం, మిరి యాల పొడి వేసి ఒక అర నిమిషం పాటు వేగనివ్వాలి.
- Step 8
అందులోనే చిల్లీ సాస్, సోయా సాస్ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
- Step 9
తర్వాత తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్, పనీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 10
తర్వాత మూత తీసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. అంతే చిల్లీ పనీర్ రెడీ.