- Step 1
పాలకూరని బాగా ఉడకబెట్టి అందులో సగం మెత్తగా చేసుకొని, మిగిలిన సగం బాగా తరుక్కోవాలి.
- Step 2
మూడు టమాటాలను సన్నగా తరిగి ఒక టమాటాను పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
- Step 3
మందంగా ఉన్న బాణలి తీసుకొని అందులో నెయ్యి, జీలకర్ర వేసి అది చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేగనివ్వాలి.
- Step 4
తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలను వేసి అది మెత్తగా అయ్యే వరకూ ఉడకనివ్వాలి.
- Step 5
అందులో పచ్చి బఠాణీ వేసి ఉడకనివ్వాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూర వేసి పెద్ద మంట మీద ఉడకనివ్వాలి.
- Step 6
తర్వాత పాలకూర గుజ్జు వేసి కాసేపు ఉడకబెట్టాలి. ఇందులో కారం, ఉప్పు వేసి చివరగా మీగడ వేయాలి.
- Step 7
పెద్దగా తరిగి పెట్టుకున్న టమాటాలను అలంకరించి చపాతీలతో సర్వ్ చేస్తే చాలా బావుంటుంది.