- Step 1
నాలుగు కప్పుల నీటిలో ఒక చెంచా నూనె, ఒక అర చెంచా ఉప్పు వేసి, సేమ్యాను మెత్తగా ఉడికించుకోవాలి.
- Step 2
సేమ్యా ముద్దగా అవ్వకుండా చూసుకోవాలి. మెత్తగా ఉడికిన సేమ్యాను వార్చుకొని, చల్ల నీరు చల్లి, ఒక పక్కకు పెట్టుకోవాలి.
- Step 3
ఒక బాణెలిలో రెండు చెంచాల నూనె వేసుకొని, కొంచం వేడి కాగానే ఆవాలు వేసి, చిట పటలాడనిచ్చుకోవాలి.
- Step 4
దీనికి మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు పోపు వేసుకొని, చక్కగా వేగనివ్వాలి. దీనికి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం కోరు తగిలించి వేగనివ్వాలి.
- Step 5
ఇప్పుడు దీనికి మామిడికాయ కోరు కలుపుకొని రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి. దీనికి తగినంత ఉప్పు వేసి (సేమ్యాలో ఒక సారి వేసుకున్న విషయం మర్చిపోవద్దు సుమా!) కలుపుకోవాలి.
- Step 6
దీనిలో సేమ్యా వేసుకొని, మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఎక్కడా ముద్దలు కాకుండా చూసుకోవాలి. ఒకసారి ఇప్పుడు ఉప్పు సరి చూసుకోండి, అంతే పుల్ల పుల్లని మామిడి సేమ్య ఉప్మా తయార్!