- Step 1
బియ్యాన్ని నానబెట్టి, నానిన బియ్యాన్ని పిండి కొట్టి తయారుగా ఉంచుకోవాలి.
- Step 2
అలాగే బెల్లాన్ని మెత్తగా తురిమి ఉంచుకోవాలి.
- Step 3
తురిమిన బెల్లాన్ని పాకంగా తయారు చెయాలి.
- Step 4
ఈ పాకంలో బియ్యపు పిండిని కలపి ముద్దగా చేయాలి.
- Step 5
ఇలా తయారయిన ముద్దను చలిమిడి అంటారు.
- Step 6
ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో వత్తి, వృత్తాకారంగా రూపొందించాలి.
- Step 7
అలా వృత్తంగా తయారైన చలిమిడిని, బాణలిలో కాగుతున్న నెయ్యిలో వేయించాలి.
- Step 8
దోరగా, బంగారు రంగుగా మారేంత వరకు వేయించి, వాటిని బయటకు తీసి అరిసెల గంటెలతో గట్టిగా వత్తి ఒక గంట ఆరబెట్టాలి.
- Step 9
ఇవి చాలా రోజులవరకు నిల్వ ఉంటాయి.