- Step 1
1. ముందుగా ఒక పాత్రలో హెవీ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల కన్ఫెక్షనరీ పంచదార వేసి బాగా కలపాలి బిస్కెట్ల పొడి ఇందులో వేసి అన్నీ కరిగిపోయేలా కలపాలి.
- Step 2
తర్వాత సర్వింగ్ బౌల్స్‌లో ఈ మిశ్రమాన్ని కింద వేసి గట్టిగా ఒత్తి వీటిని డీప్ ఫ్రిజ్ లో సుమారు 10 నిమిషాలు ఉంచాలి.
- Step 3
ఆ తర్వాత పనీర్ ను సన్నగా తురిమి కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
- Step 4
పనీర్ మిశ్రమానికి పంచదార పొడి, వెనీలా ఎసెన్స్, క్రీమ్ చీజ్ జత చేసి మెత్తగా అయ్యేవరకు గిలక్కొట్టాలి. (అవసరమనుకుంటే పాలు జత చేయాలి)
- Step 5
మామిడి పండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సగం ముక్కలను చీజ్ మిశ్రమంలో వేయాలి.
- Step 6
క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని చీజ్ కేక్ బేస్ మీద పోసి, స్పూన్‌తో సర్దాలి. మామిడి పండు గుజ్జును పైన వేసి సుమారు గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. చివరగా చీజ్ కేక్ పైన మామిడి పండు ముక్కలతో అలంకరించి, అందించాలి. అంతే మామిడి పండు చీజ్ కేక్ రెడీ.