- Step 1
ముందుగా కొత్తిమీ, పుదీన, పచ్చిమిర్చి, టమాట, లవంగాలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
- Step 2
ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
- Step 3
ఇప్పుడు అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 5నిముసాలు వేగించుకోవాలి. 5నిముషాల తర్వాత సొరకాయ ముక్కలను వేసి మరో 10నిముషాలు వేగించుకోవాలి.
- Step 4
ఇప్పుడు పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు వేగనివ్వాలి
- Step 5
తర్వాత అందులోనే ఉప్పు, ధనియాల పొడి, ఛాట్ మసాలా, గరం మసాలా పౌడర్ వేసి 5నిముషాల పాటు వేగించుకోవాలి.
- Step 6
నీళ్ళు అవసరం అయిత చాలా తక్కువగా పోసుకోవాలి. ఎందుకంటే సొరకాయ ఉడికేటప్పుడు అందునుండి కొంచెం నీరు వస్తుంది.తర్వాత మూత పెట్టి 5-6నిములు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. సొరకాయ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆప్ చేసి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ కూర రెడి.