- Step 1
గోంగూరను బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నెయ్యి, శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి.
- Step 2
ఈ వేయించిన రొయ్యల్ని నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి.
- Step 3
ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.
- Step 4
అవి వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తరువాత టమాటా ముక్కలు చేర్చాలి.
- Step 5
ఆ తరువాత ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి.
- Step 6
మరికాసేపయ్యాక ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి. ఐదారునిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది.
- Step 7
అంతే ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కూర రెడీ. దాన్ని సర్వ్ చేయాలి.