- Step 1
మూకుడులో నూనె పోసి వేడెక్కాక, జీడిపప్పులు వేసి, గోధుమ వర్ణంలోకి రాగానే, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.
- Step 2
సగం వేగాక, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మంచి ఘుమాయింపు రాగానే, కరివేపాకు, కొత్తిమీర వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి.
- Step 3
దోరగా వేగంగానే ఉడికించి పెట్టుకున్న క్యాబేజి ముక్కలతోపాటు బేబీ కార్న్ ముక్కలు కూడా వేసి కలయబెట్టి స్టవ్ మీద 3 నిమిషాలపాటు ఉంచాలి.
- Step 4
కూర దింపే ముందు కొబ్బరి, పచ్చిమిరపకాయతో కలిపి నూరి కూరలో వేసి నలువైపులా గరిటతో తిప్పాలి.
- Step 5
అంతే ఘుమఘుమలాడే క్యాబేజీ కార్న్ రెడీ. వేడివేడిగా అన్నంలోకి కానీ, చపాతీలోకి గాని తింటే చాలా బాగుంటుంది.