- Step 1
ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు ఎసరు పెట్టి, దానిలో బియ్యపు రవ్వ కలిపి పొడిపొడిగా ఉడికాక స్టౌ మీద నుంచి కిందికి దించుకోవాలి.
- Step 2
తరువాత రెండు స్పూన్లు నూనె పైన పోసి, మూతపెట్టి ఉమ్మగిల్లే వరకు ఉంచాలి.
- Step 3
అలాగే దీన్ని ఒక వెడల్పు పళ్లెంలో తీసి చల్లార్చాలి. ఈ మిశ్రమం పొడిగా ఉండేలా చేతితో చిదపాలి.
- Step 4
ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, వేరుశనగలు, శనగపప్పు, మినపపప్పు, కరివేపాకు, పసుపు, ఇంగువ, తగినంత ఉప్పు వేసుకోవాలి.
- Step 5
తర్వాత అందులో చింతపండు గుజ్జు పిండి ఉడికించాలి.
- Step 6
ఈ మిశ్రమాన్ని పళ్లెంలో చల్లార్చిన రవ్వ పిండిలో కలుపుకోవాలి.
- Step 7
అంతే ఎంతగానో ఊరించే రవ్వ పులిహోర రెడీ. ఇందులో నిమ్మకాయ పిండుకుని తింటే అదుర్స్.