- Step 1
ఓ గిన్నెలో కాసిని నీళ్లు పోసి పనీర్ ముక్కలు, కాస్త ఉప్పు, కొంచెం పసుపు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. బఠాణీలు కూడా ఉడికించి ఉంచాలి. బాణలిలో కొద్దిగా నూనెవేసి అల్లం తురుము, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి చేయించాలి.
- Step 2
విడిగా మరో బాణలిలో నూనెవేసి కాగాక జీలకర్ర, పసుపు, ధనియాలపొడి వేసి వేయించాలి.
- Step 3
ఇప్పుడు ముందుగానే వేయించిన చింతపండు, టమాటా గుజ్జు మిశ్రమం వేసి కలపాలి.
- Step 4
తరువాత క్రీమ్, చక్కెర, ఉప్పువేసి కలిపి సన్నని మంట మీద వేగనివ్వాలి.
- Step 5
తరువాత ఉడికించిన పనీర్‌ముక్కలు, బఠాణీలు వేసి కలిపి కాసేపు ఉడికించాలి.
- Step 6
అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు. చివరగా కొత్తిమీర తురుము, వెన్న వేసి దించాలి సర్వ్ చేయాలి. ఆంధ్ర మటర్ పనీర్ కూర రెడీ.