- Step 1
ముందుగా వంకాయలను నాలుగు వైపుల సగానికి కట్ చేసుకోవాలి (గుత్తివంకాయకూరకి కట్ చేసునట్టు కట్ చేసుకోవాలి)
- Step 2
ఇప్పుడు పాన్ లో నూనె వేసి వంకాయలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి.
- Step 3
ఇప్పుడు పాన్ లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి అందలో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.
- Step 4
ఉల్లిపాయలు వేగన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి, పసుపు, కారం, ఉప్పు, వేసి 3 నిమిషాలు వేయించుకోవాలి.
- Step 5
ఇప్పుడు టమాటాలు, పంచదార వేసి మగ్గనివ్వాలి.
- Step 6
టమాటాలు బాగా మగ్గిన తరువాత ముందుగా వేయించుకున్న వంకాయలు వేసి కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
- Step 7
చివరగా క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలిపి దించాలి అంతే ఎంతో రుచికరమైన స్పైసీ బైగన్ రెడి