- Step 1
ముందుగా పుచ్చకాయను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పంచదార వేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఈ పుచ్చకాయను రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టాలి.
- Step 3
అలాగే బొప్పాయకాను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 4
అలాగే మస్క్ మెలోన్(దోసకాయను)కూడా కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా రిఫ్రిజరేటర్ లో పెట్టుకోవాలి. వాటిని ఓపెన్ గా పెట్టకూడదు. అలా పెడితే, రుచి, పోషకాలు కోల్పియి, డ్రైగా ఉంటాయి.
- Step 5
అలాగే మామిడిపండ్లను కూడా చేత్తో సాఫ్ట్ గా తీసుకోవాలి. మూత ఉన్న ఒక బాటిల్ లేదా బాక్స్ లో వేసి వీటిని కూడా ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
- Step 6
తర్వాత వాటర్ మెలో తీసుకొని అందులోనే గింజలను సాధ్యమైతే తొలగించి ఒక పెద్ద బౌల్లో వేయాలి.
- Step 7
వీటితో పాటు, దోసకాయ, బొప్పాయ కాయ ముక్కలు, అలాగే అరటి పండ్ల ముక్కలు కూడా వేయాలి.
- Step 8
వీటితో పాటు లిచి పండ్లను కూడా సర్ధాలి. ఈ కట్ చేసి పండ్ల ముక్కలమీద అన్నింటి మీద పడేలా మామిడికాయ గుజ్జును కూడా వేయాలి.
- Step 9
చివరగా కొద్దిగా బ్లాక్ సాల్ట్ బేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. అంతే సమ్మర్ చిల్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ.