- Step 1
కీర దోసకాయని చెక్కుతీసి సన్నగా ముక్కలు చేసుకోండి 3 మి.మి సైజులో. అలాగే టమాటో, పచ్చి మిరపకాయను బాగా కడిగి సన్నని ముక్కలు చేసుకోండి. క్యారెట్లను తొక్కు తీసి తురుముకోండి.
- Step 2
ఇవన్ని కలిపి, వాటిలో రెండు-మూడు గుప్పెళ్ళ పెసర మొలకలు వేసి కలిపి, కొంచెం నిమ్మకాయ పిండండి. ఒక్క 2 -3 చుక్కల తేనె, ఉప్పుకావాల్సిన వాళ్లు ఉప్పు వేసి బాగా కలియబెట్టి కొత్తిమీరను సన్నగా తరిగి అలంకరించండి.
- Step 3
అప్పటికప్పుడు తింటే నీరు ఊరకుండ భలే రుచిగా ఉంటుంది.
- Step 4
పులుపు రుచి మార్పు కావాలి అనుకునే వాళ్ళకి, నిమ్మ రసం బదులు కొంచెం పచ్చి మామిడి తురుము వేసుకోవచ్చు.
- Step 5
అలాగే, క్యారెట్ బదులు లేత పచ్చికొబ్బరి, బీట్ రూట్, ముల్లంగి, బూడిదగుమ్మడి, సొరకాయ, బీర కాయ, పొట్ల కాయ తురుములలో ఏదైనా వేసుకోవచ్చు. వేసే తురుమును బట్టి కొంచెం ఉప్పు.