- Step 1
ముందుగా పెద్ద గిన్నె తీసుకొని అందులో చికెన్ ముక్కలు, పెరుగు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, చాట్ మసాలా, నిమ్మరసం, ఎల్లో ఫుడ్ కలర్, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి అన్నింటినీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని 2 గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టాలి.
- Step 2
ఆ తరువాత బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత ఒక కప్పు వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి నానబెట్టాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె,నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
- Step 4
ఆ తరువాత టమోటో వేసి చిక్కటి గ్రేవి వచేవరకు ఉడికించాలి.
- Step 5
ఇప్పుడు అందులోనే బిర్యానీ ఆకులు కూడా వేసి, నానబెట్టి పెట్టుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి10 నిముషాలు ఉడకనివ్వాలి.
- Step 6
చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌ ఆపేసి, తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టిన బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి మరగనివ్వాలి.
- Step 7
నీరు మరిగేటప్పుడు అందులో బియ్యాన్ని వేసి 10నిముషాలు ఉడికించి గంజి వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 8
ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఉడికిన అన్నం ఒక లేయర్ లా వేసి తర్వాత చికెన్ ఒక లేయర్ గా వేసుకుని కుంకుం పువ్వు వేసి నానపెట్టుకున్న పాలను ఈ లేయర్స్ మీద వేసుకుని స్టవ్ పై 5 లేక 10 నిముషాలు మూత పెట్టి ఆవిరిపై ఉడికించుకోవాలి.
- Step 9
10 నిమషాల తరువాత వేడి వేడి చికెన్ టిక్క బిర్యానీ సర్వ్ చేయడానికి రెడీ.