- Step 1
ముందుగా ఓ గిన్నెలో ముక్కలు, గుడ్డుసొన, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, మిరియాలపొడి, మైదా మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు తీసుకుని బాగా కలపాలి.
- Step 2
తర్వాత పాన్‌లో నూనె తీసుకుని ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
- Step 3
ఇప్పుడు మరో బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయాలి.
- Step 4
తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించాలి.
- Step 5
రెండు మూడు నిమిషాల తర్వాత టమోటో కెచప్, ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కల్ని వేసి వేయించాలి.
- Step 6
కొద్దిగా నీళ్ళు చల్లి వేయించి రెండు, మూడు నిమషాల తర్వాత దింపేస్తే సరిపోతుంది. చికెన్ బిట్స్ రెడీ అయినట్లే.