- Step 1
మిక్సీలో అల్లం ,వెల్లులి ,పచ్చి మిర్చి ,ఎండు కొబ్బరి ,పుదీనా,నానపెట్టిన చింతపండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి .
- Step 2
బాణలిలో నూనె వేసి ఆవాలు ,జిలకర, పసుపు ,ఉల్లిపాయలు ఫ్రై చేయాలి .ఇందులోమిక్సీ పట్టిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి .
- Step 3
మగ్గిన తర్వాత కారం ,ఉప్పు ,ధనియా పొడి ,కొబ్బరి పొడి వేసి కలపాలి .
- Step 4
చేపను సైడ్ లో కట్ చేసి లోపల ఉండే భాగాలు తీసి కడిగి పెట్టుకోవాలి .
- Step 5
చేప ఫైన కత్తితో గాట్లు పెట్టాలి. తయారు చేసిన మసాలాను చేప పైన ,లోపల సమంగా పూయాలి .
- Step 6
తర్వాత దీనిపై మైదా పిండిని చల్లుకొని ఓవెన్లో గ్రిల్డ్ చేసుకోవాలి .రుచికరమైన స్పైసి గ్రిల్డ్ ఫిష్ రెడీ