- Step 1
స్టౌ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి వేడయ్యాక దానిలో పనీర్ వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి.
- Step 2
తరువాత అదే బాణలిలో బటర్ వేసి, బటర్ బాగా కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వే సి బాగా వేయించాలి.
- Step 3
గోధుమరంగులోకి వచ్చే దాకా వేయించిన తరవాత అందులో మిరప్పొడి, జీరాపొడి, పసుపు, మెంతిపొడి, పంచదార, రెడ్‌కలర్ చుక్కలు, తగినంత ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి.
- Step 4
వీటన్నిటినీ బాగా ఉడికేదాకా ఉంచాలి. అప్పుడు గ్రేవీలాగ వస్తుంది.
- Step 5
ఇప్పుడు ముందుగానే వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.
- Step 6
కాసేపు కలిపాక కొంతసేపటికి దానిలోనుంచి నూనె పైకి తేలుతుంది.
- Step 7
అప్పుడు స్టౌవ్ ఆపేసి తయారైన పనీర్ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడి గ సర్వ్ చేసుకోవచ్చు.