- Step 1
3 రకాల పప్పులను కడిగి కుక్కర్ లో ఉడికించుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి అందులో ధనియాలపొడి, ఇంగువ, ఎండుమిర్చి వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 3,4 నిముషాలు వేగించుకోవాలి. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు, మూడు నిముషాలు వేగించుకోవాలి.
- Step 4
తర్వాత అందులో కట్ చేసిన టమోటో ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరో 4,5నిముషాలు వేగించుకోవాలి.
- Step 5
ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమంలో ఉడికించుకొన్న పప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. సరిపడా ఉప్పు వేసి మరికొన్ని నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
- Step 6
పచ్చివాసన పోయే వరకూ ఉడికించి, స్టౌ ఆఫ్ చేసి దింపాలి. అంతే టేస్టీ మసాలా దాల్ రిసిపి రెడీ .