- Step 1
క్యేరేట్, పచ్చి బఠాని, బీన్స్, బంగాళా దుంప లను ఉడికించి, దానికి పనీర్ తురుము , పచ్చిమిర్చి తురుము, ఉప్పు కలిపి ముద్దలా చెయ్యాలి.తరవాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి.
- Step 2
కడాయిలో కొంచం నూనె వేసి ముందుగా చేసుకున్న ఉండలను నూనె లో వేసి కాసేపు వేయించాలి.
- Step 3
ఇప్పుడు మైదా లో సరిపడినంత మసాలా, ఉప్పు, కొత్తిమీర, జీరా పొడి వేసి తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా చెయ్యాలి.
- Step 4
ఈ ముద్దను చిన్న చిన్న ముద్దలుగా చేసి కాస్త వెడల్పుగా వచ్చేలా ఒత్తుకోవాలి. దానిలో పనీర్ ఉండను పెట్టి మళ్ళిఉండాలా చేసి మళ్ళి దీనిని చేతితో కొంచెం వెడల్పుగా చెయ్యాలి.
- Step 5
ఇలా అన్ని చేసిన తరువాత నూనె వేడి చేసి వీటిని ధోరగా వేయించాలి. రుచికరమైన కబాబ్స్ రెడీ.