- Step 1
ముందుగా బాగా శుభ్రం చేసిన చేప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- Step 2
ఒక స్పూన్ ధనియాల పొడి,సగం కరం మసాలా, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి చేప ముక్కలను బాగా కలిపి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
- Step 3
ఆ తర్వాత చేప ముక్కలను నూనెలలో దోరగా వేయించుకోవాలి. బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టాలి. బాణలిలో బియ్యం ఉడికేందుకు తగినన్ని నీళ్లు పోసి బిర్యానీ ఆకు,యాలకులు, లవంగాలు,దాల్చిన చెక్క, ఒక స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు, కొత్తి మీర, పుదీనా వేసి మరగనివ్వాలి.
- Step 4
ఆ తర్వాత నానపెట్టిన బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసి పలుకులుగా ఉడికించాలి.
- Step 5
కుక్కర్ తీసుకొని ఒక స్పూన్ నూనె పోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేగించాలి.
- Step 6
తర్వాత పెరుగు వేసి బాగా కలిపి మిగిలిన గరం మసాలా, ధనియాల పొడి, కారం , కొత్తిమీర, పుదీనా తురుము వేసి 2 నిమిషాలు వేగించాలి.
- Step 7
తర్వాత చేప ముక్కలు, బాస్మతి అన్నం వేసి పైన నెయ్యి, వేగించిన ఉల్లిపాయలు, కొత్తిమీర తురుము చల్లి మూత పెట్టాలి.
- Step 8
పొయ్యి మీద పెనం పెట్టి, దాని మీద ఈ బిర్యానీ కుక్కర్ ను పెట్టి చిన్న మంట మీద పావుగంట పేపు ఉడికించుకోవాలి.గుమ గుమలాడే పిష్ బిర్యానీ సిద్ధం.