- Step 1
చికెన్ ముక్కలకు కత్తితో గాట్లు పెట్టి నిమ్మరసం ,ఉప్పు పట్టించాలి .లవంగాలు ,సోంపు , ధనియాలు బాండీలో వేసి వేయించాలి .
- Step 2
వీటిని పొడి చేసి చికెన్ ముక్కలకు పట్టించాలి .
- Step 3
తరువాత వెల్లులి ముక్కలు ,పచ్చి మిర్చి ముద్దను కూడా చికెనుకు పట్టించి అరగంట నాననివ్వాలి .
- Step 4
తరువాత ఈ ముక్కలను ఆవిరిమీద ఉడికించి తరువాత ఫ్రై చేయాలి .
- Step 5
వేరొక గిన్నెలో నెయ్యి వేసి అల్లంవెల్లులిముద్ద ,క్యారెట్ ముక్కలు ,టమాటో ముక్కలు వేసి వేయించాలి .
- Step 6
తరువాత కారం ,ధనియాల పొడి ,గరం మసాలా వేసి కలుపుకొని దీనిలో బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. .నీళ్లు మరిగిన తర్వాత బియ్యాన్ని వేసి దీనిలో ఉప్పు ,పుదీనా వేసి ఉడికించాలి ..వేయించుకున్న చికెన్ను ఉడికిన పులావ్ లో వేసి మూత పెట్టి కాసేపు ఉంచాలి .రుచి కరమైన చికెన్. రోస్ట్ పులావ్ రెడీ …