- Step 1
కడాయిలో ఆవనూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లి గింజలు, సోంపు తో పాటు వెల్లుల్లి తురుం వేసి వేయించుకోవాలి.
- Step 2
ఉల్లిపాయ ముక్కలు, టామాటా ముక్కలు,అల్లం తురుం,పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.
- Step 3
ఇందులో కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత చికెన్ ముక్కలు,టామాటో గుజ్జు వేసి కలుపుకోవాలి.
- Step 4
ఉడికిన తర్వాత ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్ వేసుకొని తక్కువ మంటతో ఉడికించుకోవాలి.
- Step 5
చికెన్ ఉడికిన తర్వాత పూదీనా, కొత్తి మీర వేసుకొని దించివేసుకోవాలి..స్పైసీ చికెన్ కర్రీ సిద్ధం