- Step 1
ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పచ్చి మిర్చి ముద్దను వేసి వేయించుకోవాలి.
- Step 2
ఇందులో మటన్ ముక్కలను వేసుకొని కొద్ది సేపు ఉడికిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి.
- Step 3
ఆ వెంటనే పెరుగు వేయాలి. కాజు, పిస్తా, బాదం, మిలన్ సీడ్స్ ని మిక్సిలో వేసుకొని పేస్ట్ లా తయారు చేసుకొని కూరలో వేసుకోవాలి.
- Step 4
ఇందులో క్రీం, పాలు, పచ్చి కోవా, కుంకుమ పువ్వు వేసి ఉడకనివ్వాలి.ఇదే సమయంలో మరో గిన్నె తీసుకొని నీళ్లు పోసి లవంగాలు,
- Step 5
ఇలాయిచీలు, స్ట్రార్ పూర్,బిర్యానీ ఆకులు, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో బాస్మతీ రైస్ వేసి ఉడకనివ్వాలి.
- Step 6
రైస్సగం ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టాలి.
- Step 7
మరో గిన్నె పెట్టుకొని కొద్దిగా మటన్ కర్రీ వేసి అందులో కెనడా వాటర్,రోజ్ వాటర్, క్రీమ్ ,పాలు వేసి దానిపైన అన్నం వేసుకోవాలి.
- Step 8
కొద్ది సేపు ఉడికిన తర్వాత వేయించిన ఉల్లి పాయలు, యెల్లో చిల్లీ పౌడర్, ఇలాయిచీ పౌడర్,నెయ్యి వేసి అన్నం, కూర లను లేయర్లుగా వేసుకొవాలి.
- Step 9
మరో స్టవ్ పైన తవ్వను పెట్టి బిర్యానీ గిన్నెలు దాని మీద పెట్టాలి.
- Step 10
ఆవిరి పోకుండా మూతను గోదమ పిండి గట్టి ప్యాక్ చేయాలి. అవిరి బయటకు వచ్చేంత వరకు ఉడికించి తీస్తే రుచికరమైన నిజాం మటన్ బిర్యానీ సిద్ధం.