- Step 1
ముందుగా కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత నూనెలలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి.
- Step 2
ఇందులో కరివేపాకు, ఉల్లిపాయలు లను దోరగా వేయించుకోవాలి.
- Step 3
ఇందులో అల్లం వెల్లుల్లి ఫేస్ట్, టమాటా ప్యూరీ, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి.
- Step 4
దీనిపైన నూనె తేలిన తర్వాత పచ్చి మామిడి కాయ ముక్కలతో పాటు పచ్చడి గ్రేవీ, చక్కెర, ఇంగువ వేసి కలుపుకోవాలి.
- Step 5
కొద్ది సేపటి తర్వాత ఈ మిశ్రమంలో బొమ్మిడాయలు,కొత్తి మీర వేసుకొని ఉడికించుకోవాలి.
- Step 6
పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత వేడి వేడి గా సర్వ్ చేసుకోవచ్చు…