- Step 1
ముందుగా అటుకులను కడిగి 10 నిమిషాలు నానపెట్టుకోవాలి.
- Step 2
డీప్ ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో ఇంగువ, ఆవాలు వేసి ఒక సెకను వేగించాలి.
- Step 3
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి వేసి బాగా అన్నింటిని వేయించుకోవాలి.
- Step 4
. ఇప్పుడు ఉడికించి కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. వాటితో పాటు కరివేపాకు మరియు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి
- Step 5
5నిముషా తర్వాత అందులో వేరుశెనగలు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని వేయించుకోవాలి. వేరుశెనగ కొద్దిగా బ్రౌన్ కలర్ కు మారే వరకూ వేయించుకోవాలి.
- Step 6
మొత్తం మిశ్రమం అంతా వేగిన తర్వాత నానబెట్టుకొన్న అటుకులను ఫ్రైయింగ్ పాన్ లో వేసి, నిధానంగా మిక్స్ చేస్తూ అన్నింటిని వేయించుకోవాలి. పది నిముషాల తర్వాత ఉప్పు కూడా వేసి పూర్తిగా కలగలిపి మంటను తగ్గించేయాలి.
- Step 7
ఇప్పుడు పాన్ ను స్టౌ మీద నుండి క్రిందికి దింపుకొని నిమ్మరసాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలపాలి. చివరగా కొత్తిమీర తరుగుతో పోహాను గార్నిష్ చేయాలి. హెల్తీ లెమన్ పోహా రిసిపి రెడీ.