- Step 1
మొదట.. పచ్చిమిర్చి,కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, వెల్లుల్లి ని మిక్సిలో వేసుకొని మొత్తగా ఫేస్ట్ చేసుకోవాలి..
- Step 2
ఆ తర్వాత ఒక గిన్నెలో రొయ్యలను తీసుకోని ఒక స్పూన్ సోయా సాస్, ఆప్ స్పూన్ కారం, ఆప్ స్పూర్ ధనియా పొడి,అల్లం వెల్లుల్లి ఫేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, మొక్కొ జొన్న పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి.
- Step 3
ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనంలో డీఫ్ ఫ్రై కి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్నమిశ్రమంలోని రొయ్యలను నూనెలో వేసుకొని వేయించుకోవాలి.
- Step 4
ఆ తర్వాత మరో పెనం తీసుకొని రెండు చెంచాల నూనె వేసుకొని
- Step 5
వేడి చేసుకోవాలి. ఈ నూనెలో పచ్చిమిర్చి ఫేస్ట్ ను ఉప్పు కలిసి ఫ్రై చేయాలి.
- Step 6
ఇందులో ముందుగా ఫ్రైచేసుకున్న రొయ్యలను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి…. హాట్ హాట్ చిల్లీ ప్రాన్ ఫ్రై సిద్ధం