- Step 1
ముందుగా కరివేపాకు,పచ్చి మిర్చిని మిక్సిలో వేసుకొని ఫేస్ట్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కొంచెం ఆయిల్ వేపు కోవాలి ..
- Step 2
ఆ తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి తగినంత నూనె వేసుకోవాలి.
- Step 3
నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు,కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపువేసుకోవాలి.
- Step 4
తాళింపు మగ్గిన తర్వాత మటన్ వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి.
- Step 5
ఆ తర్వాత ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి ఫేస్ట్ వేసుకొని నీళ్లు పోసుకొని మరింతగా ఉడికించుకోవాలి.
- Step 6
మటన్ సగం ఉడికిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న కరివేపాకు ,పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి.
- Step 7
అవసరమైతే మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకొని మటన్ ను ఉడికించుకోవాలి. చివరల్లో గరం మసాలా , కొత్తిమీర వేసుకోవాలి… మటన్ కరివేపాకు కర్రీ సిద్ధం.