- Step 1
ఎండు ఖుబాని పండ్లను రాత్రంతా నానబెట్టాలి. లేదంటే గోరువెచ్చని నీళ్లలో ఐదు గంటలు నానబెట్టినా సరిపోతుంది.
- Step 2
ఉదయానికి ఉబ్బి మృదువుగా అవుతాయి. వీటిని నీళ్లలోంచి తీసి లోపలి గింజలు తీసేయాలి(ఈ గింజల్ని పగులగొడితే బాదంపప్పు లాంటిదే ఉంటుంది. దీన్ని తీసి పక్కన ఉంచాలి). నానబెట్టిన నీళ్లను పారబోయకుండా పక్కన ఉంచాలి.
- Step 3
బాణలిలో పండ్లు నానబెట్టిన నీళ్లు పోసి, గింజలు తీసేసిన పండ్లను వేసి సిమ్‌లో ఉడికించాలి.
- Step 4
అవి మృదువుగా అయి రంగు మారుతుంటాయి. తరవాత పంచదార వేసి, అవసరమైతే మరికాసిని పండ్లను నానబెట్టిన నీళ్లు పోసి కలుపుతూ అవి మృదువుగా అయ్యే వరకూ ఉడికించాలి.
- Step 5
పండ్లను గరిటెతో మెత్తగా మెదపాలి. తరవాత రాస్బెరీ క్రీమ్‌తోబాటు మీగడ(మలై) కూడా వేసి కలపాలి.
- Step 6
చివరగా ఖుబానీ గింజల నుంచి తీసిన పప్పుల్నీ బాదంపప్పుల్నీ జీడిపప్పుల్నీ సన్నని ముక్కలుగా కోసి వేసి కలపాలి.
- Step 7
తియ్యతియ్యని ఖుబానీ కా మీఠా రెడీ. దీన్ని విడిగా తిన్నా ఐస్‌క్రీమ్‌తో కలిపి తిన్నా బాగుంటుంది.