- Step 1
వెడల్పాటి పాన్‌లో పాలు పొయ్యాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు కలపాలి.
- Step 2
ఈ పాలు సగం అయ్యేవరకు మరిగించాలి. ఇందులోనే చికెన్ ముక్కలు కూడా వేసి ఉడికించాలి.
- Step 3
బియ్యంలో నీళ్లుపోసి అన్నం మూడొంతులు ఉడికించాలి (అంటే అన్నం బాగా పలుకుగా ఉండాలి).
- Step 4
మరో మందపాటి గిన్నెలో అడుగున ఒక స్పూన్ నూనె వేసి పలుకుగా ఉడికిన అన్నం పొరలాగా వేయాలి.
- Step 5
దానిమీద పాలల్లో ఉడికించిన చికెన్, మళ్లీ దానిమీద అన్నం, ఆపై చికెన్… ఇలా పొరలుగా వేసి పైన నిమ్మరసం పోసి ఆవిరి పోకుండా మూత పెట్టాలి.
- Step 6
మంట బాగా సిమ్‌లో పెట్టి దీన్ని పావుగంట ఉడికించాలి. రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ