- Step 1
ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి, నీళ్ళు పోసి బాగా కాగిన తరువాత అందులో కొంచెం ఉప్పు కొంచెం నూనె పోసి తరువాత బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ హాఫ్ బాయిల్ ఐన తరువాత వడకట్టాలి.
- Step 2
అలాగే కోడి గుడ్లు కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలాగా తరుగుకోవాలి.
- Step 3
తరువాత ఒక గిన్నెలో ఆయిల్ పోసి ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 4
లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు ను దంచుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 5
తరువాత ఒక బౌల్ తీసుకోని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి పేస్టు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ దంచిన మసాలా దినుసులు వేసుకోవాలి.
- Step 6
హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ముందుగా వేయించుకోన్న ఉల్లిపాయ ముక్కలను మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి.
- Step 7
కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి.
- Step 8
రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోని బాగా కలపాలి. తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం నీళ్ళు వేసి బాగా కలపాలి.
- Step 9
తరువాత కట్ చేసి ఉంచుకొన్న చికెన్ ముక్కలను కుండలో వేసుకోవాలి అలాగే మనం ముందుగ బౌల్ లో మిక్స్ చేసుకున్న పేస్టు ను కూడా కుండలో వేసుకోవాలి.
- Step 10
అందులో బాయిల్ చేసుకున్న రైస్ ని, కోడిగుడ్లను కూడా కుండలో వేసుకోవాలి.
- Step 11
చివరిగా పైన ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు మరియు కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వెయ్యాలి.
- Step 12
దాని పైన సిల్వర్ ఫాయిల్ వేసి మూసుకోవాలి. ఈ కుండ ను పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు పాటు హై ఫ్లేమ్ ఉడకనివ్వాలి.
- Step 13
తరవాత పొయ్యి ను సిమ్ లో ఐదు నిముషాలు పాటు ఉంచాలి.
- Step 14
తరువాత పొయ్యి ఆఫ్ చేసి ఐదు నిముషాలు ఉంచి ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకు ఎంతో ఇష్టం అయిన కుండ బిర్యాని రెడీ అయ్యింది.