- Step 1
పాన్ వేడి చేసి అందులో బట్టర్ వేసి కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేగించుకోవాలి.
- Step 2
తర్వాత అందులో పచ్చిబఠానీలు, నీళ్ళు మిక్స్ చేయాలి. అందులో ఉప్పు వేయడం మర్చిపోకూడదు.
- Step 3
బఠానీలు మెత్తగా ఉడికే వరకూ బాయిల్ చేయాలి. పచ్చిబఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపుకుని, చల్లారనివ్వాలి.
- Step 4
తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకుని,అందులో వాటర్ , మిల్క్, ఉడికించిన మ్యాష్ చేసి పెట్టుకొన్న గ్రీన్ పీస్ పేస్ట్ వేసి , మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
- Step 5
తర్వాత ఇందులోనే పెప్పర్, పుదీనా ఆకులను వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.కొద్దిసేపు అలాగే ఉడికించాలి.
- Step 6
మొత్తం మిశ్రమం ఆరోమా వాసన వచ్చే వరకూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
- Step 7
అంతే గ్రీన్ పీస్, మింట్ సూప్ రెడీ దీన్ని వేడి వేడిగా బ్యూటిఫుల్ బౌల్లో సర్వ్ చేయాలి. బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.