- Step 1
క్యాప్సికం అంగుళం సైజులో ముక్కలుగ కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 2
నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేశి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 3
అల్లం వెల్లులి ముద్ద, కరివేపాకు. పసుపు వేసి కొద్దిగా వేపి క్యాప్సికం ముక్కలు,కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టి నిదానంగా మగ్గనివ్వాలి.
- Step 4
క్యాప్సికం ముక్కలు మెత్తబడ్డాక చింతపండు పులుసు , కొబ్బరి, నువ్వులు, జీలకర్ర, మెంథి పొడులు వేసి కలిపి కప్పు నీళ్లుపోసి నూనె తేలేవరకు ఉడికించి దింపేయాలి.
- Step 5
ఈ కూర బయట పెట్టినా రెండురోజులు నిలవ ఉంటుంది. ఉప్పు,నూనె సరిగ్గా ఉంటే. ఈ కూర అన్నం, రొట్టెలకు బాగుంటుంది.