- Step 1
ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, 2 టేబుల్స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.
- Step 2
చిన్న పాన్లో మిగిలిన నూనె వేసి కాగాక, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించి రవ్వ మిశ్రమంలో కలపాలి.
- Step 3
ఇష్టమైతే క్యారెట్ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చివరగా ఫ్రూట్సాల్ట్ వేసి దానిమీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండిమిశ్రమంలో కలిసేలా మృదువుగా కలపాలి.
- Step 4
ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి దించాలి.