- Step 1
ముందుగా మూకుడులో నూనె వేసి, పైవన్నీ వేసేసి ఎర్రగా వేగనివ్వాలి.
- Step 2
ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా పొడి చేసి, ఆరాకా ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి.
- Step 3
ఉప్పులో వేసిన లేక తాజా గోంగూర, నిమ్మకాయ, చింతకాయ, ఉసిరికాయ, మెంతిబద్దలు(దీనికి మాత్రం మిక్సీ అక్కర్లేదు, చిన్నచిన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వాడచ్చు), వంటి వాటికి క్రింది ఫార్ములా వాడెయ్యచ్చు.
- Step 4
మిక్సీలో మెత్తగా రుబ్బిన పచ్చడి + రెండు స్పూన్ల మెంతి గుండ + ఒక స్పూన్ కారం + తగినంత ఉప్పు - కలిపేసి, నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ పోపు వేసేస్తే, తాజా పచ్చళ్ళు తయారవుతాయి.
- Step 5
దప్పళం, తోటకూర పులుసు, పులిహోర వంటివి కలిపేటప్పుడు ఒక చెంచా మెంతి గుండ వేస్తే, ఆ రుచే వేరు.