- Step 1
స్టవ్వెలిగించి కడాయిపెట్టుకునివేడి చేసుకోవాలి.అందులో మినపప్పు వేసి లో ఫ్లేమ్లో అయిదు నిమిషాల వరకువేయించాలి.
- Step 2
వేయించిన మినపప్పును చల్లార్చి మిక్సి జార్లోకి తీసుకొని మెత్తచేసుకోవాలి.
- Step 3
grind చేసుకున్న పిండిని ఒకప్లేట్ లోజల్లించుకోవాలి.
- Step 4
బియ్యంపిండిలో మిక్సిపట్టిన మినపప్పును వేసుకోవాలి.
- Step 5
స్టవ్ వెలిగించి ఒకగిన్నెపెట్టిఅందులో వెన్నవేసిబాగాకాగాబెట్టాలి.అడినురగ వచ్చేంతవరకు.
- Step 6
కాగినవెన్ననుపిండిలో వేసుకోవాలి.తర్వాతపసుపు,కారంఉప్పు,వామువేసుకోవాలి
- Step 7
కొత్తిమీరను బాగా చిన్నగా కట్చేసి అందులో వేసి పిండిలో పదార్దాలను బాగా కలిసేలా కలుపుకోవాలి.
- Step 8
పొడిపొడిగ వచ్చిన తర్వాత కొంచెం నీరు కలుపుకుని జంతికల పిండిల బాగా కలుపుకోవాలి
- Step 9
జంతికల గొట్టంలో నక్షత్రపు ఆకారంలోఉన్న మరను పెట్టి మనం వేయించుకునే గరిటెను బోర్లించి దానిపైన రౌండ్గ అనుకుని వేడి అయిన నూనెలో తిప్పివేసుకోవాలి.
- Step 10
మీడియం ఫ్లేమ్లోపెట్టి రెండువైపులా వేయించుకోవాలి