- Step 1
ముందుగా గుడ్లును ఉడికించుకుని పొట్టుతీసి పెట్టుకోవాలి.
- Step 2
పన్నీర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- Step 3
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
- Step 4
పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత ఉల్లిముక్కలు వేసి కాస్త ఫ్రై చేసి ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాల, టమాట గుజ్జు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
- Step 5
టమాట పచ్చివాసల పోయిన తరువాత 1 గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించాలి.
- Step 6
ఉడుకుతున్న మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్, పచ్చి బఠానీ, గుడ్లు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.
- Step 7
చివరగా కొత్తిమార వేసి దించాలి అంతే ఎంతో రుచికరమైన హర్యానా ఎగ్ కర్రీ రెడీ టు సర్వ్.