- Step 1
ముందుగా అలసందలను రెండు గంటల పాటు నానబెట్టి, కుకర్ లో ఒక విజిల్ వచ్చేవరకు. ఉడికించాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు , జీలకర్ర వేసి వేసి చిటపటాలాడించాలి.
- Step 2
తర్వాత అందులోనే ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు: తరిగిన పచ్చిమిర్చి వేసి వేగించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న అలసందలు వేసి ఫ్రై చేయాలి.
- Step 4
పోపుతో అలసందులు బాగా మిక్స్ అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
- Step 5
కొద్దిసేపు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేగించాలి.
- Step 6
తర్వాత టమోటో పేస్ట్ , కొద్దిగా అవసరం అయితే నీళ్ళు కూడా పోసి మిక్స్ చేయాలి.
- Step 7
తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. మీడియం మంట మీద మూత పెట్టి కర్రీ చిక్కబడే వరకూ ఉడికించాలి.
- Step 8
చిక్కబడుతున్న సమయంలో ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి, కర్రీ దగ్గర పడే వరకూ ఉడికించాలి. అంతే అలసందలు మసాలా కర్రీ రెడీ . గార్నిషింగ్ గా కొత్తిమీర చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే అలసందల కర్రీ రెడీ..