- Step 1
కుక్కర్లో అలసందలు వేసి, కొద్దిగా నీళ్లుపోసి ఉప్పు వేసి రెండు విజిల్స్ రానివ్వాలి
- Step 2
ఓట్స్ శుభ్రంగా కడిగి ఆవిరిమీద ఇడ్లీల మాదిరిగా ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.
- Step 3
తరవాత ఓట్స్ లో కొద్దిగా ఉప్పు చల్లి టీస్పూను నూనె లేదా నెయ్యి వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల అది ముద్దలా అతుక్కోకుండా ఉంటుంది.
- Step 4
ఇప్పుడు పాన్‌లో మిగిలిన నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము అన్నీ వేసి వేగాక ఉడికించిన అలసందలు వేసి కలపాలి.
- Step 5
కొద్దిగా నీళ్లు పోసి అవి ఆవిరైపోయేవరకూ ఉడికించాలి.
- Step 6
తరవాత ఉడికించిన ఓట్స్, పసుపు వేసి ఓ నిమిషం వేయించి దించాలి. ఇప్పుడు క్యారెట్, కొబ్బరి, కొత్తిమీర తురుములతోబాటు నిమ్మరసం కూడా కలిపి అందించాలి.