- Step 1
గోధుమ పిండిలోఉప్పు, రెండుస్పూన్స్నూనెవేసిసరిపడా నీళ్ళతో చపాతిపిండిలా కలుపుకోవాలి.
- Step 2
దానికినూనెపట్టించిఒకగంటసేపునాననివ్వాలి.
- Step 3
తర్వాత శనగలు,పచ్చిమిర్చి కరివేపాకు, కొత్తిమీర అల్లంతరుగులను మిక్షిలొ వేసి కొద్దిగానీళ్ళుపోసి బరకగా ముద్దచేసుకోవాలి.
- Step 4
తర్వాత కడాయిలో టేబుల్స్పూన్నూనెవేసి ఉల్లిపాయముక్కలను దోరగా వేయించుకోవాలి.
- Step 5
తర్వాత శనగల ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించికారం,పసుపు,గరంమసాలవేసిమరో రెండునిముషాలు వేయించిదించేయాలి.
- Step 6
తర్వాత నిమ్మకాయ పరిమాణంలో చపాతి పిండి తీసుకుని దాని మధ్యలో ఉసిరికాయంత శనగల మిశ్రమాన్నిపెట్టి మూసేసి,చపాతీలుగాఒత్తుకోవాలి.
- Step 7
ఈచపాతీలను రెండువైపులానూనెవేస్తూ దోరగాకాల్చుకోవాలి