- Step 1
గోధుమలను రెండు గంటలు మినప్పప్పును అర గంట నీటిలోనానబెట్టాలి.
- Step 2
అలా అవి నానిన తర్వాత గోధుమలను మరీ మెత్తగా కాకుండాకొంచం బరకగా మిక్సీ పట్టాలి.
- Step 3
మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి.
- Step 4
ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి. (అంటే మనం ఈ ఇడ్లి వేసుకోవాలనుకనే ముందు రోజు రాత్రి పిండిని తయారు చేసుకుంటే మంచిది).
- Step 5
బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
- Step 6
క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి. నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి మరోసారి బాగా కలపాలి.
- Step 7
ఇలా కలిపిన పిండిని ఇడ్లీ రేకులలో వేసి మాములు ఇడ్లీల లాగానే ఉడికించుకోవాలి.