- Step 1
ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండి పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత మూకుడులో రెండు చెమ్చాల నూనె వేసి చిన్న ముక్కలుగా కోసిన టమాటా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసి మగ్గించాలి.
- Step 3
మూత పెట్టకుండా ఉంచితే నీరు పట్టదు పొడిపొడిగా వస్తుంది. మగ్గిన కొత్తిమీర, టమాటా మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఒక పెద్ద మూకుడులో నాలుగు చెమ్చాల నూనె, ఒక చెమ్చా నెయ్యి వేసి కాగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సాజీరా, వెల్లుల్లి వేసి, సాజీరా ఎర్రగా కాకుండానే వెంటనే మెత్తగా రుబ్బిన కొత్తిమీర మిశ్రమాన్ని వేసి వేయించాలి.
- Step 5
కొంచెం తడి పోగానే ఉడికించిన అన్నం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి.
- Step 6
దాని మీద వేయించిన జీడిపప్పు గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర రైస్ వేడివేడిగా తింటే చాలా రుచిగా వుంటుంది. బూందీ, రైతా దీని కాంబినేషన్.