- Step 1
ముందుగా కాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 2
చింతపండు నానపెట్టి బాగా గుజ్జు తయారు చేసుకోవాలి.
- Step 3
అర కప్పు నీళ్ళలో వేసి నానబెట్టాలి. తరువాత నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి.
- Step 4
తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి 10 నిముషాలు వేయించిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడు బాణలిలో పోపు పెట్టి, వేగాక చింతపండు గుజ్జు, అరకప్పు నీళ్ళు పోసి బాగా కలపాలి.
- Step 6
తరువాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి.
- Step 7
ఇప్పుడు అందులో బెల్లం కలిపిన నీళ్ళు మరియు నువ్వుల పొడి వేసి మూత పెట్టి ముక్కలు బాగా మెత్తగా అయ్యేవరకు ఉంచి దించెయ్యాలి.
- Step 8
అంతే రుచికరమైన కాకరకాయ నువ్వుల పులుసు