- Step 1
కాకరకాయలు నీటితో కడిగి తడి ఆరేదాక ఉంచాలి. ఒక కప్పులో శనగపిండి, ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి.
- Step 2
ఈ మిశ్రమం బాగా కలిపాక ఒక రెండు స్పూన్స్ నూనె పోసి మళ్ళీ బాగా కలపాలి.
- Step 3
తడి ఆరిన కాయల్ని గుత్తిగా కోసుకోవచ్చు లేదా కాయ పొట్ట మీద నిలువుగా గాటులా పెట్టి చీల్చుకోవచ్చు .
- Step 4
ఇలా తరిగిన కాయల్లో శనగపిండి మిశ్రమాన్ని కూరుకోవాలి. మిగిలిన పిండిని అలా ఉంచాలి.
- Step 5
మూకుడులో ఒక గరిట లో సగానికి నూనె పోసి కాకరకాయల్ని వేసి మూత పెట్టాలి.
- Step 6
మధ్య మధ్య లో మూత తీసి జాగ్రత్తగా కలపాలి.
- Step 7
కాయలు బాగా వేగాక మిగిలిన పిండి వేసి సరిపడా నూనె పోసి తిప్పి ఒక ఐదు నిమిషాలకి స్టవ్ ఆపేయచ్చు.
- Step 8
కాయలు క్రిస్పీ గా రావాలంటే మూకుట్లో కాకరకాయ వేస్తున్నప్పుడు సరిపడా నూనె పోసేసుకోవాలి. కాయలు వేగాక మిగిలిన పిండి పైన వేసాక ఇక నూనె పోయకూడదు.