- Step 1
పాన్ లో నెయ్యివేసి అది వేడి అయిన తరువాత అందులో చెక్క, యాలకులు, లవంగాలు వేసి 1 నిమిషంపాటు వేయించాలి.
- Step 2
ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషా వేగించాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న క్యారెట్, పొటాటో మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసిగి 5నిముషాలు వేగించాలి. మంట తగ్గించి మరో రెండు మూడు నిముషాలు వేగించాలి . తర్వాత టమటో ముక్కలు కూడా వేసి మరో 5నిముషాలు వేగించాలి.
- Step 3
ఇప్పడు అందులో ఉప్పు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించాలి. తర్వాత 3 కప్పుల నీళ్ళు పోసి మీడియం మంట మీద బాగా ఉడికించాలి. తర్వాత మంట తగ్గిచి వేగించి పెట్టుకొన్న సెమోలినా వేసి మిక్స్ చేయాలి.
- Step 4
తర్వాత అందులోనే ఓట్స్ వేసి అర చెంచా నెయ్యి వేసి బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. మూడు నిముషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి.
- Step 5
చివరగా స్టౌ మీద నుండి సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే హెల్తీ లోఫ్యాట్ ఓట్స్ మసాలా రెడీ.