- Step 1
ముందుగా చేపముక్కలను కడిగి, వాటికి ఉప్పు నిమ్మరసం పట్టించాలి.
- Step 2
పదినిముషాలు ఈ చేప ముక్కలను రిఫ్రిజరేటర్లో పెట్టాలి. అంతలోపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, జీలకర్ర మరియు ధనియాలు వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 3
తర్వాత ఫ్రిజ్ లోని చేపముక్కలు భయటకు తీసి ఈ చిక్కటి మసాలా పేస్ట్ చేపముక్కలకు రెండు వైపులా అప్లై చేయాలి. మసాలా పట్టించిన తర్వాత కూడా 10 నిముషాలు అలాగే పెట్టాలి.
- Step 4
తర్వాత పెనం మీద కొద్దగా నూనె వేసి, వేడి చేయాలి. తర్వాత అందులో అజ్వైన్ మరియు కరివేపాకు వేసి వేయించాలి.
- Step 5
అంతలోపు, చేపముక్కలను రవ్వలో పొర్లించి అన్ని వైపులా రవ్వ అంటుకొనేలా చేయాలి. తర్వాత ఈ చేపముక్కలను పాన్ లో వేసి తక్కువ మంట మీద 15నిముషాలు వేయించుకోవాలి.
- Step 6
అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటిని తీసి, సర్వింగ్ ప్లేట్ లో వేసి, కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయాలి. అంతే రవ్వ ఫిష్ ఫ్రై రెడీ.