- Step 1
కొబ్బరితురుము తప్ప మసాలా దినుసులన్నింటినీ నూనెలో వేయించుకుని చల్లారాక పొడిచేసుకోవాలి.
- Step 2
అందులో కొబ్బరి తురుమును చేర్చాలి. చట్నీలా తయారైన దీన్ని పక్కనపెట్టుకోవాలి.
- Step 3
బియ్యం, కందిపప్పు, కూరగాయముక్కలన్నింటినీ కుక్కర్‌లో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి.
- Step 4
ఒక కూత వచ్చాక దింపేయాలి. ఆ అన్నాన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి ఉడికించాలి.
- Step 5
ఐదునిమిషాలయ్యాక చింతపండు గుజ్జు చేర్చాలి.
- Step 6
ఇప్పుడు పసుపు, ఉప్పు వేయాలి. సిద్ధంచేసుకున్న మసాలా కూడా చేర్చి బాగా కలపాలి
- Step 7
ఇది కాస్త పలుచగానే ఉండాలి కాబట్టి కాసిని నీళ్లు చేర్చుకోవాలి.
- Step 8
అన్నం తయారయ్యాక దింపేయాలి.
- Step 9
బాణలిలో నెయ్యి కరిగించి ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయించి.. ఈ అన్నంపై వేసి బాగా కలిపితే నోట్లో వేసుకోగానే కరిగిపోయే బిసీబెళెబాత్ సిద్ధం.