- Step 1
బియ్యం, మినప్పప్పును ఓ గిన్నెలో తీసుకుని సరిపడా నీళ్లు పోసి కొన్నిగంటలసేపు నానబెట్టుకోవాలి.
- Step 2
తరవాత మెత్తగా రుబ్బుకుని అందులో రాగిపిండి కూడా వేసి కలిపి ఎనిమిది గంటలు పులియబెట్టాలి.
- Step 3
ఇందులో ఉప్పూ, చక్కెరా, యాలకులపొడీ, కొబ్బరి తురుమూ, గసగసాలు వేసి బాగా కలపాలి.
- Step 4
పొయ్యిమీద పెనం పెట్టి.. నెయ్యి రాసి ఈ పిండిని వూతప్పంలా నెరిపి పైన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకుల్ని వేసి మూత పెట్టేయాలి. ఎర్రగా కాలాక తీసేయాలి.
- Step 5
ఇది తియ్యగానే కాదు, రుచిగానూ ఉంటుంది. ఈ వూతప్పం శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.